మోహన్ దాస్ కరంచంద్ గాంధీ(మహాత్మా గాంధీ)

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

జన్మ నామం

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

జననం

అక్టోబరు 2, 1869పోరుబందరు(గుజరాత్)

మరణం

జనవరి 30, 1948హత్య చేయబడ్డాడు

వృత్తి

న్యాయవాది

పదవి

మహాత్మ, జాతి పిత

భార్య/భర్త

కస్తూర్బా

సంతానం

హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ

తండ్రి

కరంచంద్ గాంధీ

తల్లి

పుతలీ బాయి

సంతకము

Gandhi signature.svg


బాల్యము, విద్య: 


"మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2  తేదీన (శుక్ల నామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం) గుజరాత్లోని పోర్ బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడుఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీతల్లి పుతలీ బాయివారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబముమోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడుచిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగిందివీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీమణిలాల్ గాంధీరామదాస్ గాంధీదేవదాస్ గాంధీ). చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్ధి. పోర్ బందర్ లోను, రాజ్కోట్ లోను ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లోన్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడుతల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికిమద్యానికిస్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడుఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడిందిఅనేక మతాల పవిత్ర గ్రంధాలను చదివాడు కాలములోనే ఆయన చదువూవ్యక్తిత్వమూఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి. 1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. బొంబాయి లోను, రాజ్కోట్ లోను ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893 లో దక్షిణాఫ్రికా లోని నాటల్‌ లో ఒక లా కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది




దక్షిణ ఆఫ్రికా ప్రవాసము


ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీదక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకుగడిపాడుకేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడంహోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయివాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించిఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడుగాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీరాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయముఒక విధముగా భారతదేశం లో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయిభారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూఅన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని1894 లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడుబిల్లు ఆగలేదుగానీఆయన బాగా జనాదరణ సంపాదించాడు.
ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడుసత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని  కాలంలోనే ఆయన అమలు చేశాడుఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదునిజాయితీఅహింససౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగముగనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది1913 లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారుకష్టనష్టాలకు తట్టుకొని నిలచారుచివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టిందికానీ గాంధీకి బ్రిటిష్ వారిపై ద్వేషం లేదువారి న్యాయమైన విధానాలను ఆయన సమర్ధించాడుబోయర్ యుద్ధకాలం లో (1899-1902) ఆయన తన పోరాటాన్ని ఆపివైద్యసేవా కార్యక్రమాలలో నిమగ్నుడైనాడుప్రభుత్వము ఆయన సేవలను గుర్తించిపతకంతో సత్కరించింది కాలంలో అనేక గ్రంథాలు చదవడం వలనసమాజాన్ని అధ్యయనం చేయడం వలన ఆయన తత్వము ఎంతో పరిణతి చెందిందిలియో టాల్స్టాయ్రాసిన "The Kingdom of God is Within You", John Ruskin'యొక్క "Unto the Last" అనే గ్రంథాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయికానిఅన్నిటికంటే ఆయన ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము భగవద్గీతగీతా పఠనం వల్ల ఆయనకు ఆత్మజ్ఞానము యొక్క ప్రాముఖ్యతానిష్కామ కర్మ విధానమూ వంటబట్టాయిఅన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా ఆయన గ్రహించాడుదక్షిణాఫ్రికాలో "ఫీనిక్స్ ఫార్మ్", "టాల్ స్టాయ్ ఫార్మ్లలో ఆయన సామాజిక జీవనాన్నీసౌభ్రాతృత్వాన్నీ ప్రయోగాత్మకంగా అమలు చేశాడుఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సీదా సాదా జీవితం గడిపేవారు - కోరికలకు కళ్ళెం వేయడమూఉన్నదేదో నలుగురూ పంచుకోవడమూప్రతి ఒక్కరూ శ్రమించడమూసేవా దృక్పథమూఆధ్యాత్మిక దృక్కోణమూ  జీవితంలో ప్రధానాంశాలుగాంధీ స్వయంగా పంతులుగావంటవాడిగాపాకీవాడిగా  సహజీవన విధానంలో పాలు పంచుకొన్నాడు.

 సమయంలోనే ఆయన అస్పృశ్యతకూకులవివక్షతకూమతవిద్వేషాలకూ ఎదురు నిలవడం బోధించాడుక్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన మార్గముపోరాటాలూసంస్కరణలూ  జీవితంలో ఒక భాగముఒక అన్యాయాన్ని వ్యతిరేకించిమరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరము1914 లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడుభారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.

భారతదేశములో పోరాటము ఆరంభ దశ

భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడుఅప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలుసమస్యలను పరిచయం చేశాడుచాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ వారిని సమర్ధించిసైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడుబ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛనూహక్కులనూ కోరుకొనేవారికి  సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని ఆయన వాదం. బీహారు లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలువారి కామందులూ ఆహార పంటలు వదలినీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని రైతులను నిర్బంధించేవారుపండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారుపేదరికమూదురాచారాలూమురికివాడలూ అక్కడ ప్రబలి ఉన్నాయిఆపైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారువారు పన్నులు పెంచారు. గుజరాత్ లోని ఖేడా లోనూ ఇదే పరిస్థితిగాంధీ  పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి, 1918 లలో చంపారణ్ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడుప్రజలను చైతన్యవంతులుగా చేయడమూచదువునూ సంస్కారాన్నీ పెంచడమూజాతి వివక్షతను విడనాడడమూఅన్యాయాన్ని ఖండించడమూ  సత్యాగ్రహంలో భాగము కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడుఆయన నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచిజైలుకు తరలి వెళ్ళారుసమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై ఆయనను అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికిందిచివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీపన్నులు తగ్గించడానికీ ఒప్పందాలు కుదిరాయిఖైదీలు విడుదలయ్యారు కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో "బాపుఅనీ, "మహాత్ముడుఅనీ పిలుచుకొనసాగారుగాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూఆమోదమూ లభించాయి. 1919 లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెల్లుబికినపుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము  చట్టాలకు అడ్డు కట్ట వేసిందికాని ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు ఆయన బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపు చేసిపరిహారంగా నిరాహారదీక్ష సలిపాడుపట్టుబట్టి  దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజలపట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము విధమైన హింసయినా తప్పే. ఏప్రిల్ 13, 1919  అమృత్ సర్, పంజాబు లోని జలియన్ వాలా బాగ్ లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారుఫలితంగా సత్యాగ్రహముఅహింస అనే పోరాట విధానాలపై మిగిలినవారికి కాస్త నమ్మకం సడలగాఅవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరిందిఅంతే కాదుభారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూసర్వత్రానూ ప్రబలమైంది. 1921 లో భారత జాతీయ కాంగ్రెస్ కు ఆయన తిరుగులేని నాయకునిగా గుర్తింపబడ్డాడుకాంగ్రెసును పునర్వ్యవస్థీకరించితమ ధ్యేయము "స్వరాజ్యముఅని ప్రకటించాడువారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదువ్యక్తికీమనసుకీప్రభుత్వానికీ స్వరాజ్యము కావాలితరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించాడు.

·         "స్వదేశీ" - విదేశీ వస్తువులను బహిష్కరించడంనూలు వడకడంఖద్దరు ధరించడంవిదేశీ విద్యనూబ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడంవీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగిందిమహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారుదేశ ఆర్ధిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగిందిఆత్మాభిమానమూఆత్మ విశ్వాసమూ వెల్లి విరిశాయిశ్రమకు గౌరవాన్ని ఆపాదించడం ఆన్నింటికంటే ముఖ్యమైన ఫలితం.
·         "సహాయ నిరాకరణ" - ఏదయితే అన్యాయమో దానికి  మాత్రమూ సహకరించకపోవడంప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదువారి చట్టాలను ఆమోదించరాదు ఉద్యమానికి మంచి స్పందన లభించిందికాని 1922 లో ఉత్తరప్రదేశ్ చౌరీచౌరా లో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగిందిఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించిగాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు.
·         "సమాజ దురాచార నిర్మూలన" - గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశంఅంటరానితనమున్నచోటమురికివాడలున్నచోటహిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట స్వాతంత్ర్య మున్నదనుకోవడంలో అర్ధం లేదుగాంధీ ప్రవేశపెట్టిన  ఆలోచనా సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలూవిలువలూ ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి.
1922 లో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు కాలంలో కాంగ్రెసులో అతివాదమితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయిహిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయితరువాత  పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశాడు. 1924 లో మూడు వారాల నిరాహారదీక్ష సాగించాడుకాని వాటి ఫలితాలు కొంతవరకే లభించాయిమద్యపానముఅంటరానితనంనిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో ఆయన లీనమయ్యారు. 1927 లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేబట్టాడుఅందరికీ సర్ది చెప్పి, 1928 లో కలకత్తా కాంగ్రెసులో "స్వతంత్ర ప్రతిపత్తితీర్మానాన్ని ఆమోదింపజేశాడుఅందుకు బ్రిటిషు వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడుఆయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబర్ 31 లాహోరు లో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయబడింది. 1930 జనవరి 26 ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించాడు రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును.

పతాకస్థాయి పోరాటము

ఉప్పు సత్యాగ్రహం (దండియాత్ర), క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలుఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడుప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించిపన్ను కట్టకుండాసముద్రంలోంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిలు 6వరకు అహమ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీపాదయాత్ర  పోరాటంలో కలికితురాయిదారిపొడవునా అభినందించేవారుసన్మానించేవారుపూజించేవారు - ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగదారిలో చేరినవారితో దండి చేరుకొనే సరికి జనం వెల్లువలా పోటెత్తారుదండిలోనే కాదుదేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయిమొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారుఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931 లో గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారుఅందరినీ విడుదల చేశారు. 1932 లో లండను లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడుకాని  సమావేశం గాంధీనిస్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరచిందిలార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించాడు. 1932 లో నిమ్న కులాలవారినీ, ముస్లిము లనూ వేరుచేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారుఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడుతరువాత అంటరానివారిగా చూడబడిన వర్గాలపట్ల సమాజ దృక్పథాన్నీవారి స్థితిగతులనూ మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడువారిని హరిజనులని పిలిచాడుఆత్మశోధనకూఉద్యమస్ఫూర్తికీ 1933మే 8 నుండి 21 రోజుల నిరాహారదీక్ష సాగించాడు. 1934 లో ఆయనపై మూడు హత్యాప్రయత్నాలు జరిగాయిఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెసు సిద్ధమైనపుడు గాంధీ కాంగ్రెసుకు రాజీనామా చేశాడుతన నాయకత్వంవల్ల కాంగ్రెసులోని వివిధ వర్గాల నాయకుల రాజకీయనాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదనీస్వాతంత్ర్యమనే ప్రధాన లక్ష్యాన్నుంచి దృష్టి మరలకూడదనీ ఆయన ఉద్దేశము.
1936 లో లక్నో కాంగ్రెసు సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధానపాత్ర తీసుకొన్నాడు. 1938 లో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాస్ చంద్రబోసు తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయిబోసుకు ప్రజాస్వామ్యంపైనాఅహింసపైనా పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ యొక్క ముఖ్యమైన అభ్యంతరంఅయినా బోసు మళ్ళీ రెండోసారి కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడుతరువాత సంభవించిన తీవ్రసంక్షోభం కారణంగా బోసు కాంగ్రెసుకు దూరమయ్యాడు.
1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యిందిప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారనీఒకరి స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూమరొకప్రక్క స్వేచ్ఛకోసం యుద్ధమని చెబుతున్నారనీ బ్రిటిషు విధానాన్ని కాంగ్రెసు వ్యతిరేకించిందిపార్లమెంటు నుండి కాంగ్రెసు వారంతా రాజీనామా చేశారుబ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో "క్విట్ ఇండియాఉద్యమం ప్రారంభమైంది.
"క్విట్ ఇండియాఉద్యమం బాగా తీవ్రంగా సాగిందిఊరేగింపులూఅరెస్టులూహింసా పెద్ద ఎత్తున కొనసాగాయికాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి సమయంలో గాంధీ చిన్నచిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. "భారత్ ఛోడో"- భారతదేశాన్ని వదలండి - అన్నది నినాదము. "కరో యా మరో" - చేస్తాంలేదా చస్తాం - అన్నది అప్పటి నిశ్చయముప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది.
1942 ఆగష్టు 9  గాంధీతో బాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం అరెస్టయ్యిందిగాంధీ రెండేళ్ళు పూణే జైలులో గడిపాడు సమయంలోనే ఆయన కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించాడుఆయన సహధర్మచారిణి కస్తూరిబాయి 18నెలల కారాగారవాసం తరువాత మరణించిందిగాంధీ ఆరోగ్యం బాగా క్షీణించిందిఅనారోగ్య కారణాలవల్ల ఆయనను 1944 లో విడుదల చేశారుయుద్ధము తరువాత ఇతర నాయకులనూలక్ష పైగా ఉద్యమకారులనూ విడుదల చేశారుక్రమంగా స్వాతంత్ర్యం ఇవ్వబడుతుందని అంగీకరించారు.

స్వాతంత్ర్య సాధనదేశ విభజన

1946 లో స్పష్టమైన బ్రిటిష్ కాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చిందికాని  ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టాడుముస్లిమ్ మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశవిభజనకు నాంది అని గాంధీజీ భయముగాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటికాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిమ్ లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ, సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు. 1946-47 సమయంలో 5000 మంది హింసకు ఆహుతి అయ్యారు.హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజింపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడుఅలాంటి ఆలోచన సామాజికంగానూనైతికంగానూ,ఆధ్యాత్మికంగానూ కూడా గాంధీ తత్వానికి పెనుదెబ్బకాని ముస్లిమ్ లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నా కి పశ్చిమ పంజాబు, సింధ్, బలూచిస్తాన్,తూర్పు బెంగాల్ లో మంచి ప్రజాదరణ ఉన్నదికావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛకాని జిన్నా - "దేశ విభజనోఅంతర్గత యుద్ధమో తేల్చుకోండి" - అని హెచ్చరించాడుచివరకు హిందూ - ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించిందిఅయితే గాంధీ పట్ల ప్రజలకూ పార్టీ సభ్యులకూ ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే  నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదుఅంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ శతవిధాల ప్రయత్నించాడుచివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదుకాని ఆయన పూర్తిగా కృంగిపోయాడు. 1947 ఆగస్టు 15 దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణుడైన గాంధీమాత్రము కలకత్తా లో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడుఆయన కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిమ్ మత విద్వేషాలు పెచ్చరిల్లి ఆయనను మరింత శోకానికి గురిచేశాయి.

చివరి రోజులు

స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ-ముస్లిం విద్వేషాలను నివారించడానికీఆత్మశోధనకూ పరిమితమయ్యాయిప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడిందిమొత్తం పోలీసు బలగాలు దేశ పశ్చిమప్రాంతానికి పంపబడ్డాయితూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీ పై పడిందిదేశవిభజనతో ముఖ్యంగా పంజాబుబెంగాలు లలో పెద్దఎత్తున సంభవించిన వలసలవల్ల మత కలహాలుమారణకాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాశ్మీరు విషయమై భారత్ - పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంటాబయటా పరిస్థితి మరింత క్షీణించిందిముస్లిములందరినీ పాకిస్తాను పంపాలనీకలసి బ్రతకడం అసాధ్యమనీ వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి పరిస్థితి గాంధీకి పిడుగుదెబ్బ వంటిదిదీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని పటేల్ వంటి నాయకుల అబిప్రాయంకాని అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందనీదేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీఅంతర్యుద్ధానికి దారితీస్తుందనీ గాంధీ అభిప్రాయం విషయమై ఆయన ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడుఆయన డిమాండ్లు రెండు - (1) మత హింస ఆగాలి (2) పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. - ఎవరెంతగా ప్రాధేయపడినా ఆయన తన దీక్ష మానలేదుచివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించిందిహిందూముస్లిమ్సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని ఆయనవద్ద ప్రమాణం చేశారుఅప్పుడే ఆయన నిరాహార దీక్ష విరమించాడుకాని  మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడిందిఆయన పాకిస్తానుకూముస్లిములకూ వత్తాసు పలుకుతున్నాడని హిందూమతంలోని తీవ్రవాదులూహిందువులకోసం ముస్లిము జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లిములలోని తీవ్రవాదులూ ఉడికిపోయారు.

తనమీద హత్యాప్రయత్నం చేసినవారి గురించి గాంధీ

1948 జనవరి 30  గాడ్సే వారి బృందం గాంధీని హత్యచేయటానికి విఫల ప్రయత్నం చేసారుఅందులో వారి అనుచరుడు మదన్ లాల్ అరెస్టయినాడు విషయం గాంధీకి తెలిసిన మీదటమదన్ లాల్ ను ధైర్యం గల కుర్రాడని మెచ్చుకున్నాడటఆయన మాటలలోనే ఆయన ప్రతిస్పందన- "పిల్లలు!! వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదునేను పోయాక గుర్తుకు తెచ్చుకుంటారు ముసలాడు సరిగానే చెప్పాడని". గాంధీ

గాంధీ హత్య

1948 జనవరి 30 తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్ధన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడునేలకొరుగుతూ గాంధీ "హే రామ్అన్నాడని చెబుతారుఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన రాజ్ ఘాట్ వద్ద  మంత్రమే చెక్కి ఉన్నదిమహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్ లాల్ నెహ్రూ రేడియోలో అన్న మాటలు: "మిత్రులారామన జీవితాల్లో వెలుగు అంతరించిచీకటి అలుముకొన్నదిఏమి చెప్పటానికీ నాకు మాటలు కరవయ్యాయిమన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడుమనను ఓదార్చిదారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడునాకూకోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము".

గాంధీ గురించి గాడ్సే

గాంధీని నిలదీయటానికి ఎటువంటి చట్టపరమయిన అవకాశం లేదుఅతనికి సహజ మరణం పొందే అవకాశం ఇవ్వకూడదు అని నాకు అనిపించింది. (There was no legal machinery by which [Gandhi] could be brought to book ... I felt that [he] should not be allowed to meet a natural death.)
గాంధీని తనెలా చంపాడో-గాడ్సేమాటలలో
"పిస్టల్ నా కుడి అరచేతిలో ఇముడ్చుకొనిరెండు చేతులూ ముకుళించి 'నమస్తేఅన్నానునా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేసాను తరువాత కాల్పులు జరిగాయితుపాకీ దానంతటే పేలిందనిపించిందినేను రెండు సార్లు కాల్చానామూడు సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయంగాంధీ గుండు దెబ్బ తగలగానే 'హేరామ్అని కిందపడిపొయ్యాడునేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని 'పోలీస్పోలీస్!' అని అరవటం మొదలు పెట్టానునాకు కావలిసింది అందరూనేను  పని ముందుగావేసుకొన్న పథకం ప్రకారం కావాలని చేసానని అనుకోవాలిఅంతేకానిఏదో క్షణికావేశంలో చేశాననుకోకూడదుఅక్కడనుంచి తప్పించుకుని పారిపోవటానికి పయత్నించాననిగానీతుపాకీ వదిలించుకొవలని అనుకుంటున్నానని గాని ఎవరూ అనుకోకూడదుతుపాకీతోసహా పట్టుబడటమే నా అభిమతంకానీ దాదాపు ఒక అర నిమిషందాకాఎవరూ కదలలేదు".
నాథూరామ్ గాడ్సే హత్యా స్థలంనుండి పారిపోయే ప్రయత్నం ఏమీ చెయ్యలేదుఅతన్ని నిర్బంధించి తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషను కు తీసుకొని వెళ్ళారుఅక్కడ DSP సర్దార్ జస్వంత్ సింగ్ మొదటి సమాచార నివేదిక (First Information Report) తయారు చేసాడున్యాయ స్థానాలలో తగిన విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సే ను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15 ఉరి తీసారు.

విలువలు,పద్ధతులు

స్ఫూర్తి

చరిత్రకారుడు ఆర్.బి.క్రీబ్ ప్రకారం మహాత్మా గాంధీ యొక్క ఆలోచనా విధానం కాలంతో పాటు పరిపక్వత చెందినదిలండను లో చదువుకునే సమయంలో నిజాయితీ , నిగ్రహంపవిత్రతశాకాహారం అలవర్చుకున్నాడుభారతదేశం తిరిగి వచ్చాక న్యాయవాదిగా పనిలో వైఫల్యం పొందటంతో దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ అక్కడ పాతికేళ్ళ పాటు వివిధ భారతీయేతర సంస్కృతుల ఆలోచనలను అర్ధంచేసుకున్నాడుమహాత్మా గాంధీ పరిశీలనాత్మక మత వాతావరణంలో పెరిగాడు మరియు జీవితాంతం అనేక మతపరమైన సంప్రదాయాల నుంచి స్ఫూర్తి పొందాడుగాంధీ తల్లికి జైను లతో ఉన్న పరిచయాల వలన జైనమత ఆలోచనలైన కరుణశాకాహారంఉపవాసంస్వీయ క్రమశిక్షణప్రతిజ్ఞ యొక్క ప్రాముఖ్యత విలువల ప్రభావం గాంధీ ఫై పడినదిప్రారంభ దశలో ఉన్న జైనమత ప్రభావం తరువాతికాలంలో గాంధీ యొక్క అన్ని ఆలోచనలకు మూలం గా నిలిచాయి.

No comments:

Post a Comment