భగత్ సింగ్ | |
|---|---|
![]() భగత్ సింగ్, 21 సం. వయస్సులో | |
| పుట్టిన తేదీ: | సెప్టెంబరు 27, 1907 |
| జన్మస్థలం: | ఫైసలాబాద్, పంజాబ్, బ్రిటిషు ఇండియా |
| మరణించిన తేదీ: | మార్చి 23, 1931 |
| నిర్యాణ స్థలం: | లాహోరు, పంజాబ్, బ్రిటిషు ఇండియా |
| ఉద్యమము: | భారత స్వాతంత్ర్య ఉద్యమం |
| ప్రధాన సంస్థలు: | నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ మరియుహిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ |
బాల్యం, జీవితం
భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలివి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు. మేరా రంగ్ దే బసంతీ చోలా ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా మేరా రంగ్ దే బసంతీ చోలా యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా నవ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా మేరా రంగ్ దే బసంతీ చోలా గంభీరమైన గొంతుతో భగత్ సింగ్ పాడుతున్న ఈ పాటను విని జైలు వార్డర్లు కూడా ముగ్ధులయ్యేవారు.
ఆదర్శాలు-అభిప్రాయాలు
అసెంబ్లీ పై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు వ్రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."
ప్రభావాలు
భగత్ సింగ్ అరాజకవాదం(అనార్కిజం), సామ్యవాదం(కమ్యునిజం) అనే భావనలకు ఆకర్షితుడయ్యాడు. బకునిన్, మార్క్స్, లెనిన్ మరియు ట్రాట్స్కి ల రచనలంటే భగత్ కి చాలా ఇష్టం. అహింస, సత్యాగ్రహాలను బోధించే గాంధేయవాదం మీద భగత్ కి నమ్మకం ఉండేదికాదు. గాంధేయవాదం దోపిడిదారుల్ని మారుస్తుందే కానీ, దోపిడీ నుంచి విముక్తి కల్పించదని భగత్ విశ్వసించేవాడు.
అరాజకవాదం(అనార్కిజం)
1928 వ సంవత్సరం మే నుంచి సెప్టెంబరు వరకు భగత్ సింగ్, కిర్టి అనే పంజాబీ పత్రికలో అరాజకవాదం మీద అనేక వ్యాసాలు వ్రాసాడు. ప్రజలు అరాజకవాదాన్ని అపార్థం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేసాడు. అరాజకవాదం అంటే మన దేశం లో ఉన్న సోదరభావం, వసుధైక కుటుంబం లాంటి భావనయే అని భగత్ సింగ్ వివరించాడు.
మార్క్సిజం
మార్క్సిజం భగత్ సింగ్ పై చాలా ప్రభావాన్ని చూపింది. మార్క్సిజం పునాదుల పైనే సామాజిక పునర్నిర్మాణం జరగాలని భగత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. 1926 వ సంవత్సరం నుంచి భారత్ మరియు ఇతర దేశాలలో జరిగిన విప్లవోద్యమాల గురించి అధ్యయనం చేశాడు. తన చివరి కోరిక ఏమిటని అడిగినప్పుడు, తను వ్లాదిమిర్ లెనిన్ గురించి చదువుతున్నానని, తను మరణించే లోపు అది పూర్తి చెయ్యాలని చెప్పాడు. మార్క్సిజం ఆదర్శాలను నమ్మినప్పటికీ భగత్ సింగ్ భారత కంమ్యూనిస్టు పార్టీ లో చేరలేదు.
నాస్తికవాదం
బలిదానం
వారసత్వం
భారత స్వాతంత్ర్య సంగ్రామం
భగత్ సింగ్ మరణం ఊరికే వృథా కాలేదు, ఎందరో యువకులను భారత స్వాతంత్ర్యోద్యమము వైపుకు మరల్చింది. భగత్ సింగ్ ఉరి శిక్ష అమలు తరువాత ఉత్తర భారతదేశంలో ఎందరో యువకులు బ్రిటిషు ప్రభుత్వం మరియు గాంధీ కి విరుద్ధంగా ఆందోళనలు చేపట్టారు.
స్మృతులు, సంగ్రహాలయాలు
భారత పార్లమెంట్లో విగ్రహం
15 ఆగస్ట్ 2008న 18 అడుగుల కాంస్య విగ్రహం భారత పార్లమెంటు లో ఇందిరా గాంధీ మరియు సుభాష్ చంద్ర బోస్ విగ్రహాల ప్రక్కన ఆవిష్కృతమయింది. భారత పార్లమెంటులో భగత్ సింగ్ మరియు దత్తు యొక్క చిత్రపటాలు ఉన్నాయి.
జాతీయోద్యమ వీరుల స్మారకం
ఇక్కడే భగత్‌సింగ్ భౌతిక కాయాన్ని దహనం చేసారు. ఇది విభజన సమయంలో పాకిస్తాన్లో ఉన్న హుసేన్వాలా(సత్లుజ్ నదీ తీరంలో) ఉంది. 17 జనవరి 1961 లో 12 గ్రామాలకు బదులుగా ఇది భారతదేశానికి మార్చబడింది. బీకే దత్త్ ఆఖరి కోరిక ప్రకారం 19 జులై 1965 లో అతన్ని ఇక్కడే దహనం చేసారు, అలాగే భగత్ సింగ్ అమ్మ, విద్యావతిని కూడాజాతీయోద్యమ వీరుల స్మారకం దహనసంస్కారం జరిగిన ప్రదేశంలో 1968లో నిర్మించబడింది. ఇంకా ఇక్కడ భగత్‌సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్దేవ్ల స్మృతులు పొందుపరచబడ్డాయి. 1971 నాటి యుద్ధంలో పాకిస్తానీ సైన్యాలు ఈ స్మారకాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పాకిస్తాన్ కు తరలించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ వాటిని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి ఇవ్వలేదు, కానీ, 1973లో స్మారకం అప్పటి పంజాబ్ ముఖ్య మంత్రి జైల్ సింగ్ కృషితో తిరిగి నిర్మించబడింది. యేటా, 23 మార్చిన షహీదీమేలా(పంజాబీ:అమరవీరుల సంత) జాతీయోద్యమ వీరుల స్మారకం వద్ద నిర్వహించబడుతుంది. వేలాది మంది జనం ఇక్కడ నివాళులర్పిస్తారు. ఈ రోజును పంజాబ్ రాష్ట్రమంతా పాటిస్తారు.
భగత్ సింగ్ సంగ్రహాలయం మరియు భగత్ సింగ్ స్మారకం
భగత్ సింగ్ 50వ వర్ధంతి రోజున అతని స్వగ్రామం ఖట్కర్ కలాన్‌లో షహీద్-ఎ-అజమ్ సర్దార్ భగత్ సింగ్ సంగ్రహాలయం తెరవబడింది. అక్కడ అతని స్మృతులు ప్రదర్శనకు ఉంచబడ్డాయి. వీటిలో అతని సగం కాలిన చితా భస్మం, అతని రక్తంతో తడిచిన ఇసుక, ఇంకా భస్మాన్ని ఉంచిన రక్తపు మరకలు కలిగిన వార్తాపత్రిక ఉన్నాయి. లాహోరు ఘటన యొక్క కాగితం కూడా ఒకటి ప్రదర్శనలో ఉంది. అందులో కర్తార్ సింగ్ సరభకు ఉరి ఇచ్చిన తీర్పు, ఇంకా భగత్ సింగ్ పై వేసిన నిందారోపణల తీర్పు వివరాలు ఉన్నాయి. భగత్ సింగ్ దస్కతు ఉన్న భగవద్గీత పుస్తకం-ఇది అతనికి లాహోర్ జైలులో ఇవ్వబడింది, ఇంకా ఇతర సామగ్రి ఉన్నాయి. భగత్ సింగ్ స్మారకం 2009లో ఖట్కర్ కలాన్‌లో ₹16.8 కోట్ల ఖర్చుతో నిర్మించబడింది.
ఇతర
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఒక సంగ్రహాలయాన్ని నెలకొల్పింది, ఇందులో భారతీయ న్యాయవ్యవస్థలోని మైలురాళ్ళను ప్రగతినీ ప్రదర్శించాలనుకున్నారు, ఇంకా ఇందులో కొన్ని చారిత్రాత్మక తీర్పులకు సంబంధించిన అంశాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి తీర్పు ప్రదర్శన అంశంగా "భగత్ సింగ్ విచారణ"ను ఎంచుకున్నారు. దీన్ని 28 సెప్టెంబర్ 2007లో భగత్ సింగ్ జయంతి వేదుకలలో భాగంగా నిర్వహించారు. సెప్టెంబర్ 2007లో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఖాలిద్ మక్బూల్ లాహోర్ సంగ్రహాలయంలో భగత్ సింగ్ స్మారకాన్ని ప్రదర్శిస్తామని ప్రకటించారు. గవర్నర్ ప్రకారం ఉపఖండంలో మొదటి అమరవీరుడుగా భగత్ సింగ్ ఎందరో యూవకులకు స్పూర్తిని అందించారు. Ali, Mahir (26 September
2007). "మొదటి అమరవీరుడికి నివాళి". Dawn. Retrieved 11 October 2011.</ref> కానీ అది మాటలకే పరిమితమయింది.
నేటికీ భారత యువత భగత్ సింగ్ నుండి ఎంతో స్పూర్తిని పొందుతున్నారు. ఇండియాటుడే 2008లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం అత్యంత గొప్ప భారతీయుడిగా భగత్ సింగ్ ఎన్నుకోబడ్డాడు. పోటీలో సుభాష్ చంద్రబోస్ ఇంకా గాంధీ వెనుకంజలో ఉండిపోయారు. శతజయంతి సందర్భంలో మేధావుల ఒక సమూహం భగత్ సింగ్ సంస్థాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి భగత్ సింగ్ ఆలోచనలను ఇంకా ఆదర్శాలను అమలు చేయటానికి కృషి చేసింది. 2001 మార్చ్ 23న పార్లమెంటులో భగత్ సింగ్ కు నివాళులర్పించారు. 2005 లో కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు. పాకిస్తాన్ లోని లాహోర్ లో భగత్ సింగ్ ను ఉరి తీసిన షద్మన్ చౌక్ ను భగత్ సింగ్ చౌక్ గా పేరు మార్చాలని భగత్ సింగ్ ఫౌండేషన్ ఆఫ్ పాకిస్తాన్ అభ్యర్థన చేసింది, న్యాయపరమయిన సమస్యల వల్ల ఇది ఇంకా అమలు కాలేదు.
సినిమాలు
హిందీ సినిమాలెన్నో భగత్ సింగ్ జీవితాన్ని, అతని కాలపు సన్నివేశాలను ఆధారించి తీయబడ్డాయి. ఇందులో మొదటిది 1954 నాటి "షహీద్-ఎ-ఆజాద్ భగత్ సింగ్". తరువాత 1963లో "షహీద్ భగత్ సింగ్" షమ్మీ కపూర్ భగత్ సింగ్ పాత్రధారిగా వచ్చింది. రెండేళ్ళ తరువాత 1965లో మనోజ్ కుమార్ భగత్ సింగ్ గా "షహీద్" అనే సినిమా తెరకెక్కింది. 2002లో మూడు ప్రముఖ చిత్రాలు భగత్ సింగ్ స్పూర్తిగా విడుదలయ్యాయి. ఇవి :
"షహీద్-ఎ-ఆజం","23 మార్చ్ 1931:షహీద్" మరియు "ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్".
2006లో వచ్చిన "రంగ్ దే బసంతీ" నేతి యువత నేపధ్యంలో భగత్ సింగ్ కాలమ్నాటి విప్లవాలను చూపిస్తూ తెరకెక్కింది. ఈ చిత్రంలో భారత స్వాతంత్ర్య పోరులో భగత్ సింగ్ పాత్రను ప్రస్ఫుటీకరించారు. 2008లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రెరీ మరియు ANHAD సమ్యుక్తంగా "ఇంకలాబ్" అనే 40 నిమిషాల డాక్యుమెంటరీని నిర్మించారు.
రంగస్థలం
భారతదేశం మరియు పాకిస్తాన్ లో ఎన్నో నాటకాలకు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లు ప్రేరణనిచ్చారు. నేటికి ఆయా నాటకాలు ఎందరో ఆహూతులను ఆకర్షిస్తున్నాయి.
పాటలు/గేయాలు
ఉర్దూ దేశభక్తిగీతమయిన "సర్ఫరోషీ కీ తమన్నా"(త్యాగానికై అభిలాష) ఇంకా "మేర రంగ్ దే బాంతీ చోలా"(అమ్మా, నా అంగవస్త్రానికి కాశాయ రంగు అద్దు) రాం ప్రసాద్ బిస్మిల్ ద్వారా రాయబడినా, భగత్ సింగ్ తోనే అనుబంధంగా గుర్తించబడ్డాయి. ఎన్నో సినిమాలలో భగత్ సింగ్ కు అనుబంధంగా ఈ పాటలను వాడారు.
ఇతరత్రా
1968లో భగత్ సింగ్ 61వ జయంతి సందర్భంలో ఒక తపాళా బిళ్ళను ప్రచురించారుసెప్టెంబర్ 2006లో భారత ప్రభుత్వం కొన్ని నాణాలను భగత్ సింగ్ స్మృతిలో ముద్రించాలనుకుంది. కానీ జూన్ 2011 వరకు కూడా అవి విడుదల కాలేదు
విమర్శలు
భగత్ సింగ్ అతని విధానాల వలన జీవితాంతం, మృత్యువు తరువాత కూడా విమర్శించబడ్డాడు. బ్రిటిష్ వారికి విరుద్ధంగా అతని విప్లవాత్మక మరియు హింసాత్మక ఆలోచనలు, మరియు గాంధేయవాద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు విరుద్ధంగా అతని ఆలోచనలు ఇందుకు కారణం. సాండర్స్ ని తుపాకీతో కాల్చడం ఇంకా ప్రాణాంతకం కాని బాంబులను విసరడం వంటివి గాంధీ అహింసా వాదానికి విరుద్ధం.

No comments:
Post a Comment